- Advertisement -
న్యూఢిల్లీ : విపక్షాల ఐక్యతపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడకుంటే తర్వాత భారతదేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని ఆప్ గురువారం ఆరోపించింది.
2024లో నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానిగా ఎన్నికైతే రాజ్యాంగాన్ని మార్చి దేశానికి ‘రాజు’గా ప్రకటించుకునే అవకాశం ఉందని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. మోడీ బతికున్నంత వరకు ఆయనే దేశానికి ప్రధానిగా ఉండేలా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని అన్నారు. ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ఆప్ వ్యాఖ్యలపై స్పందించారు. సౌరభ్ వ్యాఖ్యలు మూర్ఖంగా ఉన్నాయని అన్నారు.
- Advertisement -