Friday, April 4, 2025

సౌరభ్ చౌదరికి స్వర్ణం

- Advertisement -
- Advertisement -

కైరో: ఈజిప్టు రాజధాని కైరో వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత్‌కు చెందిన సౌరభ్ చౌదరి స్వర్ణం సాధించాడు. మంగళవారం జరిగిన పురుషు ఎయిర్ పిస్టోల్ విభాగం ఫైనల్లో సౌరభ్ విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. జర్మనీకి చెందిన మిఖాయిల్‌తో జరిగిన ఫైనల్లో సౌరభ్ 166 తేడాతో విజయం సాధించాడు. ఆరంభం నుంచే పూర్తి ఏకాగ్రతతో ఆడిన సౌరభ్ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా అడుగులు వేశాడు. చివరి వరకు నిలకడైన ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు. మరోవైపు మహిళల విభాగంలో భారత షూటర్ ఇషా సింగ్ రజత పతకాన్ని సాధించింది. గ్రీస్ షూటర్ అన్నా కొరకాకితో జరిగిన ఫైనల్లో ఇషా ఓటమి పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News