Sunday, December 22, 2024

నేను రోహిత్ స్థానంలో ఉంటే అలా చేసేవాడిని: సౌరవ్ గంగూలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోని తొలి టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవడంపై టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ స్థానంలో తాను ఉండి ఉంటే తొలి టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్లకు తోడుగా ఉండేవాడినని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం జట్టుకు నాయకుడి అవసరం ఉందని, వీలైనంత త్వరగా రోహిత్ ఆస్టేలియాకు చేరుకుంటే బాగుంటుందని సౌరవ్ సలహా ఇచ్చాడు. ఆటగాళ్లకు తోడుగా కెప్టెన్ ఉంటే మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. భారత్ వేధికంగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్ వాష్ ఐనా విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రోహిత్ సతీమణి రితికా రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతడు ముంబయిలో ఉన్నాడు. శుక్రవారం ఉదయం పండంటి మగ్గబిడ్డకు జన్మనిచ్చినట్లు రోహిత్ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. రోహిత్ అతి త్వరలోనే ఆస్ట్రేలియాకు చేరుకుంటారని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ఇప్పుడు రోహిత్ నాయకత్వం జట్టుకు ఎంతగానో అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News