Monday, December 23, 2024

సేవ్ కాంగ్రెస్ ఫ్రమ్ ఆర్‌ఎస్‌ఎస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన కంది శ్రీనివాస్ రెడ్డికి ఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్ కేటాయించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అ న్నారు. ఎన్నోఏళ్లుగా పార్టీ అధికారంలోకి లేకు న్నా తామంతా పనిచేస్తూ వస్తున్నామని అలాంటి తమకు కాకుండా పారాచూట్ నేతకు టికెట్ ఇవ్వడంపై సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేసుకుని పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. కొంతమంది రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ టికెట్లను అ మ్ముకున్నారని ఆరోపించారు. సమావేశంలో డిసి సి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, సీనియర్ లీడర్ లక్ష్మారెడ్డి , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి సహా నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు.

శ్రీనివాస్ రెడ్డి కోసం తాము పనిచేయమని అవసరమైతే రాజీనామా కైనా సిద్ధమని పేర్కొన్నారు. నేతలను కాదని కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని ఖండించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్ర సుజా త మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా పార్టీ కోసం క ష్టపడ్డ నాయకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషిచేసిన వారికి అధిష్ఠానం మోసం చేసిందన్నా రు. మేరకు వచ్చే ఎన్నికల్లో పార్టీ కంది శ్రీనివా స్‌కు ఇచ్చిన టికెట్ ను వెంటనే రద్దు చేయాలనీ లేనిపక్షంలో తాము ఎవరమూ పార్టీ పక్షాన పనిచేయబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ని యోజకవర్గంలోని పలు మండలాల సీనియర్ కాం గ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.
పాలమూరులో విధ్వంసం
మహబూబ్‌నగర్ బ్యూరో: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేవరకద్ర ఎంఎల్‌ఎ టికెట్ తనకు వస్తుందని భావించిన కాటం ప్రదీప్‌గౌడ్ సోమవా రం డిసిసి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీరుని నిరసిస్తూ నేతలపై ఆరోపణలు గుప్పిస్తూ ఆయన అనుచరులు వీరంగం సృష్టించారు. ఫర్నిచర్ స్టేబుల్స్ ధ్వంసం చేశారు. అనంతరం డిసిసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇతర నేతలు సర్దిచెప్పినప్పటికి ప్రదీప్‌గౌడ్ వినకపోవడంతో కాంగ్రెస్ నాయకులు మధ్య ప్రదీప్‌గౌడ్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News