Wednesday, January 29, 2025

అమ్మ భాషను కాపాడుకోవాలి: బుద్ధ ప్రసాద్

- Advertisement -
- Advertisement -

అమరావతి: అమ్మ భాషను కాపాడుకోవడమే మా లక్ష్యమని ప్రపంచ తెలుగు రచయిత మహా సభల అధ్యక్షుడు, ఎంఎల్ఎ బుద్ధ ప్రసాద్ తెలిపారు.  హైదరాబాద్ గతంలో తెలుగులో న్యాయ పాలన సదస్సు ఏర్పాటు చేశామని,  దాదాపు 70 తీర్పులు తెలుగులో రావడానికి కారణం జస్టిస్ ఎన్.వి. రమణ అని ప్రశంసించారు. విజయవాడలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో బుద్ధ ప్రసాద్ ప్రసంగించారు. తెలుగు సభల వేళ రామోజీరావును స్మరించుకోవడం అవసరం అని స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు సభలకు ఈనాడు సంస్థ అధినేత  రామోజీరావు వెన్ను దన్నుగా నిలిచారని కొనియాడారు.   తన కళ్ల ముందు తెలుగు కనుమరుగున పడకూడదని రామోజీరావు కోరుకునేవారని, 2011 లో తెలుగు సభలకు రామోజీరావు స్వయంగా హాజరయ్యాని గుర్తు చేశారు.

ఆయన తెలుగు కోసం తెలుగు వెలుగు పత్రికను నిర్వహించారన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల తెలుగులో విద్య కనుమరుగు అవుతుందని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. భుజాన ఆంగ్లం తుపాకీ పెట్టి తెలుగును కాల్చే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమీ ప్రతిష్టను తగ్గించిందని, గత ప్రభుత్వం తెలుగు అకాడమినీ తెలుగు సంస్కృతంగా మార్చిందని బుద్ధ ప్రసాద్ మండిపడ్డారు.   గత ఐదేళ్ల లో భాషాపరంగా ఎపిలో ఎలాంటి కృషి చేయలేదని, తెలుగు కళలు, కళారూపాలను కాపాడుకోవాల్పిన అవసరం ఉందని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. అనేక పుస్తకాలు ప్రచురించి  తెలంగాణ అకాడమీ చక్కటి  కృషి చేసిందని, దీంతో పాటు కేరళ అకాడమీని మించి తెలంగాణ అకాడమీ కృషి చేసిందని మెచ్చుకున్నారు. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో తమిళ భాషకు ప్రత్యేక హోదా ఇచ్చారని,  దివంగత ముఖ్యమంత్రి కరుణా నిధి ఒత్తిడితో తమిళ భాషకు ప్రాచీన హోదా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News