Wednesday, January 22, 2025

సావిత్రిబాయి ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

 

విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి, తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించింన మహిళ సావిత్రిబాయ పూలే అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా రా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి, దళిత, బహుజన స్త్రీ జనోద్దరణ కోసం తన జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి పూలే అని అన్నారు. మహిళల వికాసం కోసం, సాధికారత కోసం సావిత్రిబాయి ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో బాలికల విద్య, సంక్షేమం, భద్రత, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

బాలికలకు రెసిడెన్ష యల్ బాలికల విద్య కల్పించేందుకు గత కేంద్ర ప్రభుత్వం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేస్తే మోడి నాయకత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేజీబివిలను పక్కన పెట్టిందన్నారు. బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారు కేంద్రం నిధులు ఇవ్వకున్నా..రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ కేజీబివిలను గతంలో కంటే గొప్పగా కొనసాగిస్తోందన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు తొలిసారిగా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 53 డిగ్రీ కాలేజీలు పెట్టి ఇంటర్ తర్వాత మహిళలు విద్య మానేయకుండా కొనసాగించేందుకు కృషి చేస్తోందన్నారు.

రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం లేకుండా అయితే కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చి, వారి విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడిన తీరును ప్రదర్శించిందన్నారు. విద్య పూర్తయిన తర్వాత మహిళలను పారిశ్రామికవేత్తలు చేసేందుకు వి. హబ్ పెట్టిందని, విద్య లేకుండా కూడా మహిళలను పారిశ్రామికవేత్తలు చేసేందుకు స్త్రీ నిధి బ్యాంక్ నెలకొల్పిన ఘనత కేసిఆర్ గారి ప్రభుత్వానిదేనన్నారు.

మహిళల పేరుమీదే ఇండ్ల మంజూరు, పట్టాలు, రేషన్ కార్డులు ఇస్తూ, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు ఇస్తూ, మహిళల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, మహిళల్లో రక్తహీనత తొలగించేందుకు న్యూట్రిషన్ కిట్స్, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవిస్తే కేసిఆర్ కిట్స్, తల్లీ –బిడ్డ సంరక్షణ కోసం అబ్బాయి పుడితే 12వేలు, అమ్మాయి పుడితే 13వేల రూపాయలు అందిస్తూ ప్రతి దశలో బాలికలు, మహిళా వికాసం కోసం పాటుపడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో అమలు చేస్తూ సావిత్రిబాయి పూలేకు నిజమైన నివాళులు అర్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News