Monday, December 23, 2024

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : మండలంలోని పద్మాజివాడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా అద్యక్షుడు మద్దెల బాగయ్య నాయకులు, విద్యార్థులతో కలసి జ్యోతీరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి జీవితం సమాజానికి ఆదర్షమన్నారు.

భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాద్యాయురాలిగా విద్యాభివృద్దికి ఎంతగానో కృషి చేసారన్నారు. పీడిత ప్రజలు,స్త్రీల విద్యా కోసం అహర్నిషలు పాటుపడిన మహోనన్నతురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజి సర్పంచ్ ఇ.లింగారెడ్డి, నాయకులు కవీన్,నర్సపురం రాజయ్య, చంద్రయ్య, కేషవ్, నాగయ్య, సాయిలు, ప్రభు జడ్‌పిహెచ్‌ఎస్, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News