Monday, December 23, 2024

మోడీజీ దేశానికి సారీ చెప్పండి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని ఆర్థి క వ్యవస్థ పతనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ఆరోపించారు. పురోగమనం దిశగా అడుగు వేస్తున్న భారత దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారని మండిపడ్డారు. నవంబర్ 8వ తేదీ 2016న దేశంలోని నోట్లో అన్నింటిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. ఈ తప్పుడు నిర్ణయం వలన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. నల్లధనం వెలికి తీయడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీ వ్రవాదానికి నిధులు ఆపడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అం టూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెప్పిన మా టలన్నీ అవాస్తవాలేనని తేలిపోయిందని విమర్శించారు. నోట్ల రద్దు లాంటి విఫల నిర్ణయాని కి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నోట్ల రద్దు దుష్పఫలితాలను గుర్తు చేస్తూ, వాటి కి బాధ్యత తీసుకోని ప్రధానిపై కెటిఆర్ తీవ్ర స్థా యిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోట్ల రద్దు నిర్ణ యం ఆర్థిక వ్యవస్థను కుంగదీసిన ఘోర వైఫల్యమన్నారు. ప్రధాని చెప్పిన ఒక్క లక్ష్యం కూ డా నెరవేరని ఆర్థిక వైపరీత్యమని పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వతా ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థలో సూమారు 30.88లక్షల కోట్ల నగదు ప్రజల వద్ద ఉందన్నారు. దీంతో నోట్ల రద్దుపైన మోడీ చెప్పిన అన్ని మాటలు ఆసత్యాలే అని తెలిపోయిందన్నారు.2016లో 500,1000 రూపాయలనోట్లను రద్దు చేసిన తర్వాత 2017 జనవరి నాటికి రూ.17.97 లక్షల కోట్లు చలామణిలో ఉండేవన్నారు. ప్రస్తుతం అది 72 శా తం పెరిగి రికార్డు స్ధాయిలో 30.88 లక్ష ల కో ట్లకు పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. 2016 నుంచి అదనం గా 12.91లక్షల కోట్ల నగదు కొత్తగా చలామణిలోకివచ్చిందన్నారు.నోట్ల రద్దు చేసిన 2016 నుంచి ప్రతి ఏటా ఆర్థిక వ్యవస్థలో తమ లావాదేవీల కోసం నగదును వినియోగిస్తున్న ప్రజల శాతం క్రమంగా పెరుగుతూ వస్తున్నదని కేంద్ర ప్రభుత్వ గణంకాలు నిరూపిస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తక్కువ నగదు ఉన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, లావాదేవీల డిజిటలైజేషన్, బ్యాంకుల నుంచి నగదు తీసుకోవడం, నగదు డిపాజిట్ చేయడం వంటి వాటిపైన పెద్ద ఎత్తున పరిమితులు పెట్టినా, కేంద్రం పేర్కొన్న తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నెరవేరలేదని కెటిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న విధంగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నోట్ల రద్దు విజయం సాధించిందని గొప్పలు చెప్పుకుంటున్నదని ఎద్దేవా చేశారు. రద్దయిన పెద్దనోట్ల సొమ్ములో 99.3 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని ఆర్‌బిఐ గణాంకాలతో సహా ప్రకటించిందన్నారు. రద్దయిన పెద్ద నోట్ల విలువ 15.41 లక్షల కోట్లుకాగా.. తిరిగి డిపాజిట్ అయిన వాటి విలువ 15.31 లక్షల కోట్లని తెలిపిందన్నారు. లక్షల కోట్ల నల్లధనాన్ని పట్టుకోవడానికే నోట్ల రద్దు అస్త్రం ప్రయోగించమాని ప్రకటించుకున్న కేంద్రం.. చివరికితెల్ల ముఖం వేయాల్సి వచ్చిందని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కెటిఆర్ తెలిపారు.

మోడీవన్నీ ఆనాలోచిత నిర్ణయాలే

ప్రధానమంత్రి అనాలోచితం నిర్ణయం వల్లనే ప్రస్తుతం దేశంలోని ప్రజలు, ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు, కరోనా వలన పెద్ద ఎత్తున సూక్ష్మ,మధ్య తరహా పరిశ్రమలు నుంచి మొదలుకొని భారీ పరిశ్రమల దాకా అనేక ఇబ్బందులు ఎదుర్కోన్నాయన్నారు. ఫలితంగా లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది అన్నారు. ప్రజలు నిరుద్యోగుల మారడంతో 2016 నుంచి 2019 మద్య సూమారు 50 లక్షల ఉద్యోగాలు కొల్పోయారన్నారు. 2016లో 88 లక్షల మంది కనీసం ఐటి రిటర్న్ లు సైతం దాఖలు చేయలేకపోయారన్నారు. ఒకవైపు పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు తగ్గడంతో ప్రభుత్వాల పన్ను రాబడి సైతం అత్యధికంగా పడిపోయిందన్నారు. దీంతో ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపైన తీవ్రమైన నకారాత్మక ప్రభావం కలిగిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తప్పయితే, సజీవంగా దహనం చేయాలని అప్పుడు ప్రధానమంత్రి ప్రజలను మాటలతో మభ్యపెట్టారన్నారు.

సజీవ దహనం మాట పక్కన ఉంచి కనీసం నోట్ల రద్దు దుష్పరిణామాలకు బాధ్యతను సైతం తీసుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్ధలతోపాటు నిపుణుల అభిప్రాయం మేరకు దేశ ఆర్ధిక వ్యవస్ధను అడ్డంగా కూలదోసి, దేశ ప్రజల జీవితాలను తారుమారు చేసిన నోట్ల రద్దు తప్పు అని ఒప్పుకొని దేశ ప్రజానీకానికి ప్రధానమంత్రి మోడీ క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేకమైన అడ్డదిడ్డమైన, అర్ధరహితమైన నిర్ణయాలు తీసుకుంటూ రికార్డు స్థాయి నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి అనేక దుష్పరిణామాలతో మరింత తిరోగమనానికి దారి తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని కెటిఆర్ ధ్వజమెత్తారు.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ప్రచార పటోపాలను పక్కనపెట్టి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అవసరమైన సానుకూల నిర్ణయాలను తీసుకోవడంపైన దృష్టి సారించాలని ఆయన సూచించారు.

రూ. 21వేల కోట్ల ఖర్చే తప్ప…సాధించింది శూన్యం

కొత్త నోట్ల ముద్రణకు ఆర్‌బిఐకి అనవసరంగా రూ. 21వేల కోట్ల ఖర్చు కావడం తప్ప సాధించింది శూన్యమని కెటిఆర్ అన్నారు. ఇప్పటికి దేశంలో కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేవన్నారు. 50 శాతం పైగా ఈ -కామర్స్ లావాదేవీల్లో సైతం క్యాష్ అండ్ డెలివరీ పద్ధతిని వినియోగిస్తూ తమ లావాదేవీల కోసం నగదునే ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.

ఆర్ధిక వ్యవస్థ తిరోగమనం

కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా అర్థరహితంగా తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో కొనసాగుతున్నదని కెటిఆర్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదన్నారు.. నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్ వంటి వాటిని ఆర్దిక వ్యవస్ధ పతనానికి కారణాలుగా కేంద్ర ప్రభుత్వం చూపిస్తోందన్నారు. అయితే లాక్ డౌన్ కన్నా ముందే 2020 నాటికి వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలో ఉన్న విషయాన్ని దాచి ఉంచుతోందని కెటిఆర్ మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News