Monday, December 23, 2024

బిసిలకు లక్ష ఇస్తామని చెప్పడం మరోకసారి మోసమే : కేశబోయిన శ్రీధర్

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : బీసీలకు లక్ష రూపాయలు ఇస్తామని సీఎం కెసిఆర్ చెప్పడం అంటే బీసీలను మరోకసారి మోసం చేయడానికేనని హైదరాబాద్ జిల్లా ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు అందజేస్తానన్నా రూ.1లక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.5లక్షల మంది బిసిలు దరఖాస్తు చేసుకున్నారని, కానీ చివరికి ఓబిసిలకు అందని ద్రాక్షగానే మిగులుతుందని ఆయన విమర్శించారు.

ఒక వేళ దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులందరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తే రూ.5.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంద న్నారు. కానీ అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది రూ.400కోట్లు మాత్రమేనని, ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 10 0మందికి మాత్రమేనని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో దాదాపు సగానికి పైగా బిసిల జనాభా ఉందని ఆఓట్లను కొల్లగొట్టడం కోసం సీఎం కెసిఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఘాటూగా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News