Wednesday, January 8, 2025

‘మాయా పేటిక’ నుంచి ‘సాయొనారా..’ సాంగ్

- Advertisement -
- Advertisement -
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆదివారం చిత్ర యూనిట్ ‘సాయొనారా..’ అనే యూత్ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది.
గుణ బాల‌సుబ్ర‌మ‌ణియన్ సంగీతం అందించిన ‘సాయొనారా..’  సాంగ్‌కు శ్రీమ‌ణి లిరిక్స్ అందిం,చారు. హారికా నారాయ‌ణ‌న్ హ‌స్కీ వాయిస్‌తో పాడిన సాంగ్ యూత్‌కు క‌నెక్ట్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా.. నిర్మాతలు మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి  మాట్లాడుతూ ‘‘జూన్ 30న ‘మాయా పేటిక’ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ కూడా ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్‌, సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ‘సాయొనారా..’ అనే యూత్‌ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశాం. ఇదొక డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఓ సెల్ ఫోన్ ఆధారంగా చేసిన మూవీ. అదేంటో తెలుసుకోవాలంటే ‘మాయా పేటిక’ మూవీ చూడాల్సిందే’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News