Monday, December 23, 2024

ఎలాంటి స్లిప్, ఐడి ప్రూఫ్ లేకుండా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు

- Advertisement -
- Advertisement -

ముంబై: బ్యాంకు కస్టమర్లు రూ. 2000 నోట్లను ఒక రోజుకు గరిష్ఠంగా రూ. 20000 వరకు ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడి ప్రూఫ్ వంటివి లేకుండా మార్చుకోవచ్చని ‘ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’  శనివారం తెలిపింది. భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) శుక్రవారం ఆశ్చర్యకరంగా రూ. 2000 నోట్లను పబ్లిక్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో జమా చేయడం లేదా మార్చుకోవడం చేసుకోవచ్చని ప్రకటించింది. 2016 నవంబర్‌లోనైతే రాత్రికి రాత్రే రూ. 500, రూ. 1000ని డీమానిటైజేషన్ కారణంగా రద్దు చేసింది. కానీ ఇప్పుడు రూ. 2000 నోట్లను మార్చుకోడానికి, జమా చేయడానికి గడువు ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News