Friday, December 20, 2024

ఎస్‌బిఐ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ నియమితులయ్యారు. ఎస్‌బిఐ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని అనేక మార్కెటింగ్, ప్రమోషనల్ క్యాంపెయిన్‌లలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని బ్యాంక్ ప్రకటించింది. ఒత్తిడిలో స్పష్టమైన ఆలోచనలు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే ప్రఖ్యాతి గాంచిన సామర్థ్యం ఆయన్ని ఎస్‌బిఐ బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చేందుకు ఆదర్శంగా నిలిచాయని ఎస్‌బిఐ పేర్కొంది. ఎస్‌బిఐ చైర్మన్ దినేష్ ఖరా మాట్లాడుతూ, ఎస్‌బిఐ బ్రాండ్‌కు ధోనీ సరైన ఎంపిక అని అన్నారు. ధోనీతో భాగస్వామ్యం ద్వారా విశ్వాసం, సమగ్రత, అచంచలమైన అంకితభావంతో దేశానికి, వినియోగదారులకు సేవ చేయాలనే సంస్థ నిబద్ధతను బలోపేతం చేస్తుందని అన్నారు. కొద్ది రోజుల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News