Tuesday, July 2, 2024

రూ.3 కోట్లతో ఉడాయించిన ఎస్‌బిఐ ఎటిఎం డిపాజిట్ సంస్థ ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

నగరంలోని బోయిన్ పల్లిలో రూ.3 కోట్లతో ఉడాయించాడో వ్యక్తి. ఎస్‌బిఐ ఎటిఎంలో డిపాజిట్ స్వ్కేర్ వాల్యూ సంస్థలో పనిచేస్తున్న లక్ష్మణ్ సంస్థ డిపాజిట్ వాహనం నుంచి రూ.3 కోట్లతో పరారయ్యాడు. బోయిన్ పల్లిలోని ఎటిఎంలో లక్ష్మణ్ మనీ డిపా జిటర్ గా పని చేస్తున్నాడు. లక్ష్మణ్ పై సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎస్‌బిఐ ఎటిఎంలో డబ్బు డిపాజిట్ చేసే ఓ సంస్థలో పని చేసే వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. 3 కోట్ల రూపాయల డబ్బుతో అతడు ఎస్కేప్ అయ్యాడు. స్వ్కేర్ వాల్యూ సంస్థ నగరంలోని ఎస్బీఐ బ్యాంకులకు సంబంధించిన ఎటిఎంలలో నగదును జమ చేస్తుంటుంది. కొన్నేళ్లుగా ఆ సంస్థ ఈ పని చేస్తోంది. అయితే, అదే సంస్థలో పని చేసే లక్ష్మణ్ రూ.3 కోట్ల రూపాయలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లాడు.

సిబ్బంది ఎటిఎంలో డబ్బు డిపాజిట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సిబ్బంది డబ్బు డిపాజిట్ చేయడంలో బిజీగా ఉండగా వాహనంలో ఉన్న డబ్బు బ్యాగుతో లక్ష్మణ్ ఉడాయించాడు. ఆ బ్యాగులో 3 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లుగా తెలుస్తోంది. సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లాడు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సిసిటివి ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, లక్ష్మణ్ కొంతకాలంగా ఆ సంస్థలో పని చేస్తున్నాడని, నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడని వెల్లడించారు. స్వ్కేర్ వాల్యూ సంస్థ సిబ్బంది 24 గంటల పాటు పని చేస్తారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఎస్‌బిఐ బ్యాంకుకి చెందిన ఎటిఎంలలో నగదు డిపాజిట్ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News