Friday, November 15, 2024

ఎస్‌బిఐ ఖాతాదారులు ఆన్‌లైన్‌లో బ్రాంచ్ మార్చుకోవచ్చు

- Advertisement -
- Advertisement -

SBI branch change in online by customer

 

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ తన కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటి నుంచి బ్రాంచ్‌ను ఆన్‌లైన్‌లో మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కస్టమర్లు ఎవరైనా తమ తమ ఖాతాలను మరొ క శాఖకు బదిలీ చేయా లనుకుంటే ఇదే ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు ఇకపై బ్యాంకు కు వెళ్లవలసిన అవస రం ఉండదు. ఇంట్లో నుంచే బ్రాంచ్‌ను సులభంగా మార్చుకోవచ్చు. కరోనా మహమ్మారి దృష్టా ఎస్‌బిఐ ఈ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకునే సౌకర్యం కల్పించింది. ఆన్‌లైన్ కస్టమర్లు కాకుండా యోనో ఎస్‌బిఐ, యోనో లైట్ ద్వారా కూడా తమ బ్రాంచ్‌ను మార్చవచ్చు. కస్టమర్ మొబై ల్ నంబర్ ఖాతాకు లింక్ చేసి ఉంటేనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్‌ఎస్‌బిఐ.కామ్‌లోకి లాగిన్ కావడం ద్వారా బ్రాంచ్‌ను మార్చుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News