న్యూఢిల్లీ: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం రాష్ట్రపతి భవన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) కొత్త శాఖను ప్రాంభించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభించిన ఎస్‌బిఐ తొలి శాఖ ఇది. ఈ శాఖలో తొలి కస్టమర్‌గా రాష్ట్రపతి తన ఖాతాను తొరిచారు. ఖాతాను తెరిచిన వెంటనే రాష్ట్రపతికి ఆయన పాస్‌బుక్‌ను అందజేసినట్లు రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడ్, ఎస్‌బిఐ చైర్మన్ దినేశ్ ఖారాల సమక్షంలో రాష్ట్రపతి ఎస్‌బిఐ బ్రాంచ్‌ని ప్రారంభించారు. ఒకే చోట అన్ని ఆర్థిక సేవలను అందించడంతో పాటుగా ఈ శాఖలో వీడియో కెవైసి, ఆటోమేటెడ్ క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్ మిషన్, పాస్‌బుక్ ప్రింటింగ్ సదుపాయం లాంటి తాజా డిజిటల్ సదుపాయాలు కూడా ఉన్నాయని ఆ ప్రకటన తెలిపింది. రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఉన్నప్పటికీ ఈ శాఖ అక్కడ ఉండే వారికే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుందని ఆ ప్రకటన తెలిపింది.
SBI branch Inaugurated at Rashtrapati Bhavan