Monday, January 20, 2025

2023లో మార్పులివే.. మారనున్న క్రెడిట్ కార్డు నియమాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం(2023)లోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరంలో ఆర్థికంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన కొన్ని నియమాలలో ముఖ్యమైన మార్పులు ఉండబోతున్నాయి. జనవరి 1 నుండి ఎన్‌పిఎస్ డిపాజిట్, బీమా వంటి వాటికి కెవైసి పత్రాలు తప్పనిసరి, మరోవైపు క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లకు కొత్త నియమాలు ఉంటాయి. వాటి ప్రత్యక్ష ప్రభావం వినియోగదారుల జేబుపై పడనుంది. అందుకే ఈ కొత్త నిబంధనల గురించి సమాచారాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఎస్‌బిఐ కార్డ్ రివార్డ్ పాయింట్లలో మార్పులు
ఎస్‌బిఐ కార్డ్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో 2023 జనవరి 1 నుండి కొన్ని మార్పులు చేసింది. ఎస్‌బిఐ వెబ్‌సైట్ ప్రకారం, జనవరి 1 నుండి అమెజాన్‌లో ఎస్‌బిఐ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి 10కి బదులుగా 5 రెట్లు రివార్డ్ పాయింట్‌లను పొందుతారు. బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, ఈజీ డైనర్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్ మునుపటి కంటే 10 రెట్లు రివార్డ్ పాయింట్‌లను పొందడం కొనసాగిస్తాయి.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పాయింట్లలో మార్పు
జనవరి 1 నుండి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో కూడా మార్పులు ఉంటాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్మార్ట్‌బై ఆన్‌లైన్ పోర్టల్‌లో విమానాలు, హోటల్ బుకింగ్‌లపై రివార్డ్ పాయింట్‌ల రీడెంప్షన్ కోసం నెలవారీ పరిమితి జనవరి 1 నుండి నిర్ణయిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News