Saturday, November 16, 2024

అమర జవాన్ల పిల్లల సంక్షేమానికి ఎస్‌బిఐ విరాళం

- Advertisement -
- Advertisement -

గవర్నర్‌కు రూ.17,12,200 చెక్కును అందజేసిన సిజిఎం జింగ్రాన్

SBI donates for welfare of children of immortal soldiers

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : అమర జవాన్లు, మాజీ సైనికులు, యుద్ధ వీరులకు చెందిన బాలికల సంక్షేమం కోసం ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ తన వంతుగా సహాయం అందిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలతో కూడిన రూ.17,12,200 చెక్కును ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సిజిఎం అమిత్ జింగ్రాన్ చేతుల మీదుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు. 2016 నుంచి ఎస్‌బిఐ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతి సంవత్సరం ‘సాయుధ దళాల పతాక దినోత్సవం’ జ్ఞాపకార్థంగా సిబ్బంది స్వచ్ఛందంగా విరాళాలను అందిస్తారు. ఇంతటి గొప్ప కార్యానికి బ్యాంకు ముందుకు రావడం ఇతర సంస్థలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News