Wednesday, January 22, 2025

ఎస్ బిఐ కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి!

- Advertisement -
- Advertisement -

 

SBI SMS FRAUD

ముంబయి: ఎస్ బిఐ  ఎస్ఎంఎస్  మాదిరిగా అకౌంట్ బ్లాక్ అయిందని మెసేజ్ వస్తే ఆఎస్ఎంఎస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. నిజంగా ఎస్ బిఐ పంపినట్టుగానే ఒక ఫేక్ ఎస్ఎంఎస్ కొందరు కస్టమర్లకు వచ్చిందని, కానీ ఆ ఎస్ఎంఎస్ ను ఎస్‌బిఐ పంపలేదని.. కొందరు సైబర్ నేరగాళ్ల పనిగా పేర్కొంది. ఇలాంటి ఫేక్ ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్ విషయంలో కస్టమర్లు ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం హెచ్చరించింది. తొందరపడి ఆ ఫేక్ ఎస్ఎంఎస్ లేదా ఫేక్ ఈ-మెయిల్స్ కు  స్పందిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపింది. అంతేకాదు.. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాల విషయంలో గోప్యత పాటించాలని, షేర్ చేయవద్దని సూచించింది.

ఎస్‌బిఐ కస్టమర్లకు ‘Dear A/c Holder Your SBI Bank Documents has expired A/c will be Blocked Now Click https://sbikvs.II Update by Net Banking’ అని ఎస్ఎంఎస్ వస్తే మాత్రం అస్సలు స్పందించకండి. ఈ  ఎస్ఎంఎస్ ఒకవేళ ఎస్ బిఐ   కస్టమర్లలో ఎవరికైనా వస్తే తక్షణమే report.phishing@sbi.co.inలో రిపోర్ట్ చేయాల్సిందిగా PIB పేర్కొంది.  ఎస్ బిఐ  ఇలాంటి ఎస్ఎంఎస్ ను పంపలేదని తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు ప్రచారంలోకి రావడం ఇదేమీ తొలిసారి కాదు. RBI KYS Norms పాటించకపోవడం వల్ల మీ అకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నామని కొందరు ఎస్‌బీఐ కస్టమర్లకు ఈ సంవత్సరం మార్చిలో కూడా ఫేక్ ఎస్ఎంఎస్ లు వచ్చాయి.

SBI Warning

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News