న్యూఢిల్లీ : ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అన్ని టర్మ్ రుణాలపై వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచింది. దీంతో మూడు నెలల వరకు రుణ రేటు (ఎంసిఎల్‌ఆర్) మార్జినల్ కాస్ట్ 6.65 శాతం నుంచి 6.75 శాతానికి పెరగనుంది. అదే సమయంలో 6 నెలలకు 6.95 శాతం నుంచి 7.05 శాతానికి మారనుంది. కొత్త రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు ఎస్‌బిఐ నుంచి రుణం తీసుకోవడం ఖరీదైనదిగా మారింది. ఎంసిఎల్‌ఆర్ ఆధారంగా రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. దీంతో కస్టమర్లు ఇప్పుడు వ్యక్తిగత, ఆటో, గృహ రుణాల ఇఎంఐలో ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు 2016 నుంచి ఎంసిఎల్‌ఆర్ ఆధారంగా రుణాలు ఇస్తున్నాయి. బ్యాంకులు తమ నిర్వహణ ఖర్చులు, నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించడం వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎంసిఎల్‌ఆర్‌ని నిర్ణయిస్తాయి.
ఎస్‌బిఐ ఎంసిఎల్‌ఆర్
రుణ పదవీకాలం ముందు ఇప్పుడు
ఒక రోజు 6.65% 6.75%
ఒక నెల 6.65% 6.75%
మూడు నెలలు 6.65% 6.75%
ఆరు నెలలు 6.95% 7.05%
ఒక సంవత్సరం 7.00% 7.10%
రెండు సంవత్సరాలు 7.20% 7.30%
మూడు సంవత్సరాలు 7.30% 7.40%