- Advertisement -
న్యూఢిల్లీ : ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కస్టమర్లకు శుభవార్త వినిపించింది. నగదు బదిలీ కోసం తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపిఎస్) పరిమితిని పెంచినట్లు ప్రకటించింది. ఎస్‌బిఐ వెబ్‌సైట్ ప్రకారం, ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తాయి. ఐఎంపిఎస్ ద్వారా రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల మధ్య డబ్బును పంపవచ్చు. దీనికి రూ. 20, జిఎస్‌టి ఉంటుంది. ఆర్‌బిఐ 2021 అక్టోబర్‌లో ఐఎంపిఎస్ లావాదేవీ పరిమితిని రూ.2 లక్షల నుండి రూ. 5లక్షలకు పెంచింది. ఐఎంపిఎస్ అనేది ఒక వినూత్న రియల్ టైమ్ చెల్లింపు సేవ, ఇది రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఈ సేవను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అందిస్తోంది.
- Advertisement -