Monday, December 23, 2024

రెండు కొత్త టర్మ్ ప్లాన్‌లను ప్రారంభించిన ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రైవేట్ జీవిత బీమా సంస్థల ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు కొత్త టర్మ్ పథకాలను ప్రారంభించింది. ఒకటి ‘ఎస్‌బిఐ లైఫ్ – సరళ్ స్వధన్ సుప్రీం’, రెండు ‘ఎస్‌బిఐ లైఫ్ -స్మార్ట్ స్వధన్ సుప్రీం’, ఈ పథకాలు కేవలం లైఫ్ కవర్ అందించడమే కాదు, కస్టమర్ ఆర్థిక లక్ష్యాలను నెరవేరుస్తాయి. మెచ్యూరిటీ సమయంలో ప్రీమియమ్‌ల వాపసు అందించటం వల్ల ప్రయోజనం కూడా అందిస్తుంది.

ఈ ప్లాన్‌లు పాలసీ టర్మ్‌లో పాలసీదారు మరణించినప్పుడు ఒక ఏక మొత్తం ప్రయోజనాన్ని అందిస్తాయి. జీవిత బీమా పాలసీ వ్యవధిలో జీవించి ఉన్నట్లయితే చెల్లించిన మొత్తం ప్రీమియంలను కూడా తిరిగి చెల్లిస్తుంది. ఈ రెండు పథకాలను ప్రారంభించడంపై ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ అభిజిత్ గులానికర్ మాట్లాడుతూ, వినియోగదారులకు తమ ప్రియమైన వారి ఆర్థిక రక్షణను నిర్ధారించడానికి సరసమైన లైఫ్ కవర్‌ను అందించే బీమా పరిష్కారాలను ఆవిష్కరించడం పట్ల ఎస్బిఐ లైఫ్ గర్వపడుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News