Friday, November 22, 2024

ఎస్‌బిఐ మెయిన్స్ పరీక్ష వాయిదా

- Advertisement -
- Advertisement -

SBI Mains Exam Postponed

హైదరాబాద్:  జూలై 31న జరగాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. జూలై 10-13 మధ్య జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాలు తేలడానికి ఇంకాస్త సమయం పట్టడమే ఇందుకు కారణమంగా తెలుస్తోంది. అయితే మొయిన్స్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 5000 మందికి పైగా జూనియర్ అసోసియేట్‌లను నియమించనున్నారు. మెరిట్ జాబితాలో చేరేందుకు అభ్యర్థులు మూడు దశలను (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ)లలో అర్హత సాధించాలి. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా బ్యాంకులోని వివిధ శాఖలలో పోస్ట్ చేస్తారు. ఎస్‌బిఐ క్లర్క్ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను బ్యాంక్ sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.

SBI Mains Exam Postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News