Monday, December 23, 2024

రామంతపూర్‌లో ఎస్‌బిఐలో ఘరానా మోసం

- Advertisement -
- Advertisement -

ఖాదారుల పేరుతో బ్యాంక్ మేనేజర్లు రుణాలు తీసుకుని మోసం చేసిన కోట్లాది రూపాయలు కాజేసిన ఘటన  రామంతపూర్ ఎస్‌బిఐ బ్రాంచ్‌లో వెలుగు చూసింది. నిందితులు బ్యాంక్ ఖాతాదారుల పేరుతో రూ.2.80కోట్లు దోచుకున్నారు. రామంతపూర్‌లోని ఎస్‌బిఐలో మేనేజర్లు షేక్ సైదులు, గంగమల్లయ్య గతంలో పనిచేశారు. వారు పని చేసిన సమయంలో ఖాతాదారులకు తెలియకుండా వారి పత్రాలు పెట్టి రూ.2.80 కోట్లను రుణంగా తీసుకున్నారు. లోన్ అప్లై చేసిన ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకున్న సదరు మేనేజర్లు ఫామ్ 16ను ఫోర్జరీ చేసి తప్పుడు స్టేట్‌మెంట్లతో లోన్లు తీసుకున్నారు.

ఆ వచ్చిన లోన్ అమౌంట్‌ను భార్య, కుమారుడి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో దాదాపు 19 మంది పేర్లపై మేనేజర్లు లోన్లు తీసుకున్నారు. అయితే కొత్త మేనేజర్ రావడంతో వీరి బండారం బయటపడింది. బ్యాంకులో జరిగిన మోసాన్ని గుర్తించిన కొత్త మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్లు షేక్ సైదులు, గంగమల్లయ్యపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. షేక్ సైదులు, భార్య సుష్మ, కొడుకు పీరయ్య, మరో మేనేజర్ గంగమల్లయ్య పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మేనేజర్ల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News