Friday, November 22, 2024

జూలై 1 నుంచి ఎస్‌బిఐ కొత్త చార్జీలు

- Advertisement -
- Advertisement -

SBI new charges from July 1

 

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 2021 జూలై 1 నుండి కొత్త సేవా చార్జీలను అమలు చేయనుంది. అంటే జులై నుంచి కస్టమర్లు ఎటిఎంల నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి, చెక్కుల ద్వారా లావాదేవీలు చేయడానికి కొత్త సర్వీస్ చార్జీని చెల్లించాలి. ఇది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బిఎస్‌బిడి) ఖాతాదారులకు వర్తిస్తుంది. ఎస్‌బిఐ వెబ్‌సైట్ ప్రకారం, జూలై 1 నుండి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు అదనపు విలువ ఆధారిత సేవలు అమల్లోకి వస్తున్నాయి.

క్యాష్ విత్‌డ్రా నాలుగు సార్లే

జూలై 1 నుండి బిఎస్‌బిడి ఖాతాదారులకు బ్యాంక్ శాఖ లేదా ఎటిఎం నుండి నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యం లభిస్తుంది. కస్టమర్ నాలుగు కంటే ఎక్కువగా విత్‌డ్రా చేస్తే బ్యాంక్ చార్జీ వసూలు చేస్తుంది. పరిమితికి మించి ఎస్‌బిఐ లేదా ఇతర బ్యాంక్ ఎటిఎమ్‌లలో నగదు ఉపసంహరణ చేస్తే బ్యాంక్ రూ.15 జిఎస్‌టి వసూలు చేయనుంది.

చెక్‌బుక్ చార్జీలు

బిఎస్‌బిడి ఖాతాదారులకు ఎస్‌బిఐ ఆర్థిక సంవత్సరంలో 10 చెక్కులను ఉచితంగా ఇస్తుంది. దీని తరువాత 10 చెక్కుల చెక్‌బుక్ కోసం 40 రూపాయల జిఎస్‌టి చెల్లించాలి. అదే సమయంలో 25 చెక్కుల చెక్‌బుక్ కోసం రూ.75తో వినియోగదారుల నుండి జిఎస్‌టిని వసూలు చేస్తారు. దీంతో పాటు 10 చెక్కుల అత్యవసర చెక్‌బుక్‌కు రూ.50తో పాటు జిఎస్‌టి కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్లకు చెక్‌బుక్కుల్లో కొత్త సేవా చార్జీ నుండి మినహాయింపు ఉంది. ఎస్‌బిఐ, ఎస్‌బిఐ యేతర బ్యాంకు శాఖలలో బిఎస్‌బిడి ఖాతాదారుల ఆర్థికేతర లావాదేవీలకు ఎటువంటి రుసుము ఉండదు. అదేవిధంగా బ్యాంక్ శాఖలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బదిలీ లావాదేవీలపై ఎటువంటి చార్జీ ఉండదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News