Thursday, January 23, 2025

రూ.19 కోట్లు అప్పు తీర్చాలని షకీల్ కు నోటీసులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో షాక్ తగలింది. అప్పు చెల్లించాలని షకీల్ కు బ్యాంక్‌ నోటీసులు ఇచ్చింది. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించలేదని ఎస్బిఐ నోటీసులు జారీ చేసింది. రూ.19 కోట్ల బకాయి గడువులోగా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటీసులపై ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కానీ ఆయన అనుచరులు కానీ స్పందించలేదు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ప్రజాభవన్ వద్ద మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొట్టడంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో షకీల్ కారు ఢీకొనడంతో ఒక చిన్నారి దుర్మరణం చెందిన విషయం విధితమే. ఇప్పటికే ఈ రెండు కేసులతో  షకీల్ సతమతమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News