Monday, December 23, 2024

ఎస్ బిఐ  వినియోగదారులకు  ఏప్రిల్ 1 నుంచి భారీ వడ్డన

- Advertisement -
- Advertisement -

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఏప్రిల్ 1 నుంచి డెబిట్ కార్డుల నిర్వహణ ఛార్జీలను పెంచినట్లు తెలిపింది. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ ఛార్జీలను గరిష్ఠంగా రూ. 75 మేరకు పెంచింది.

క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు రూ. 125 (జిఎస్టీ అదనంగా) వసూలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి దీన్ని రూ. 200 చేసింది. యువ, గోల్డ్, కాంబో కార్డులపై ప్రస్తుతమున్న రూ. 175 ఛార్జీలను రూ. 250కు సవరించింది. ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీలను రూ. 250 నుంచి రూ. 325కు పెంచింది.

వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

  • క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్ డెబిట్ కార్డులతో సహా డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ రూ. 125 నుంచి రూ. 200కు పెంచారు. జిఎస్టీ అదనం.
  • యువా, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్( ఇమేజ్ కార్డ్)ల మెయిన్ టెన్స్ రూ. 175 నుంచి రూ. 250కు పెరిగింది. జిఎస్టీ అదనం.
  • ఎస్బిఐ ప్లాటినం డెబిట్ కార్డు నిర్వహణ రూ. 250 నుంచి రూ. 325కు పెంచారు. జిఎస్టీ అదనం.
  • ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్ఢ్ వంటి ఎస్బీఐ డెబిట్ కార్డులకు వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ. 350 నుంచి రూ. 425కు పెరిగింది. జిఎస్టీ అదనం.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News