Wednesday, January 22, 2025

తగ్గిన ఎస్‌బిఐ నికర లాభం

- Advertisement -
- Advertisement -

sbi q1 net profit falls 6.7 percent

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిన రూ.6,068 కోట్లుగా నమోదయింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం రూ.6,504 కోట్లతో పోలిస్తే దాదాపు 7 శాతం తగ్గడం గమనార్హం. బ్యాంక్ మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.77,347.17 కోట్లు కాగా ఇప్పుడు 74,998.57 కోట్లకు చేరిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తుల(ఎన్‌పిఎ) నిష్పత్తి 5.2 శాతంనుంచి 3.91 శాతానికి తగ్గగా నికర ఎన్‌పిఎలు సైతం 1.7 శాతంనుంచి 1.02 శాతానికి చేరినట్లు ఎస్‌బిఐ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News