Wednesday, January 22, 2025

క్షీణించిన ఎస్ బిఐ లాభం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.9,164 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికరలాభం క్షీణించడం గమనార్హం. అప్పట్లో రూ.14,205 కోట్ల నికర లాభాన్ని ఎస్‌బిఐ నమోదు చేసింది. అధిక పెన్షన్ ఖర్చులు, సిబ్బంది వేతన సవరణల కోసం రూ.7,100 కోట్లు ఖర్చు చేసినందునే లాభాలు తగ్గాయని బ్యాంక్ తెలిపింది. అయితే బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.98,084 కోట్లనుంచి రూ.1,18,193 కోట్లకు పెరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎస్‌బిఐ తెలిపింది.

సమీక్షా త్రైమాసికంలో నిరర్థక ఆస్తులు( ఎన్‌పిఎలు) 3.14శాతంనుంచి 2.42 శాతానికి తగ్గాయి. ఏకీకృత ప్రాతిపదికన ఎస్‌బిఐ గ్రూప్ నికర లాభం 29 శాతం క్షీణించిరూ.11,064 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.15,477 కోట్లుగా ఉంది. అయితే మొత్తం ఆదాయం రూ.1,27,219 కోట్లనుంచి రూ.1,53,072 కోట్లకు పెరిగింది. మూడో త్రైమాసికంలో ఎస్‌బిఐ పెన్షన్ ఫండ్స్‌లో ఎస్‌బిఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ 20 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో పెన్షన్ ఫండ్స్ లిమిటెడ్‌లో బ్యాంక్ వాటా 60 శాతంనుంచి 80 శాతానికి పెరిగింది. ఇందుకోసం రూ.229.52 కోట్లు వెచ్చించినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News