Friday, November 22, 2024

ఆర్టీఐ చట్టం కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు ఎస్‌బిఐ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

బాండ్లను రీడీమ్ చేసిన దాతలు, రాజకీయ పార్టీల వివరాలతో మార్చి 14న ఎస్‌బిఐ తన వెబ్‌సైట్‌లో అందించిన డేటాను ఈసి ప్రచురించింది.

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ (ఈసి)కి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆర్టీఐ చట్టం కింద వెల్లడించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నిరాకరించింది. అయినప్పటికీ ఆ రికార్డులు పోల్ ప్యానెల్ వెబ్‌సైట్‌లో, పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి.

ఎలక్టోరల్ బాండ్ల పథకం “రాజ్యాంగ విరుద్ధం, స్పష్టంగా ఏకపక్షం” అని పేర్కొంటూ,  ఏప్రిల్ 12, 2019 నుండి కొనుగోలు చేసిన బాండ్ల పూర్తి వివరాలను ఈసికి అందించండి అని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ఎస్ బిఐని ఆదేశించింది, అది తన వెబ్‌సైట్‌లో సమాచారాన్నిమార్చి 13న ప్రచురిస్తుందని తెలిపింది. మార్చి 11న, గడువును పొడిగించాలని కోరుతూ ఎస్‌బిఐ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది , మార్చి 12న పని వేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసికి వెల్లడించాలని ఆదేశించింది.

ఆర్‌టిఐ కార్యకర్త కమోడోర్ (రిటైర్డ్) లోకేశ్ బాత్రా మార్చి 13న ఎస్‌బిఐని ఆశ్రయించి, సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈసికి అందించిన  ఎలక్టోరల్ బాండ్ల పూర్తి డేటాను డిజిటల్ రూపంలో ఇవ్వాలని కోరారు.

సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద ఇచ్చిన రెండు మినహాయింపు నిబంధనలను ఉటంకిస్తూ బ్యాంక్ సమాచారాన్ని తిరస్కరించింది. అవి:   సెక్షన్ 8(1)(ఇ) విశ్వసనీయ సామర్థ్యంలో ఉన్న రికార్డులకు సంబంధించినది, విత్‌హోల్డింగ్‌ని అనుమతించే సెక్షన్ 8(1)(జె) వ్యక్తిగత సమాచారం.

ఇప్పటికే ఈసి  వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని ఎస్ బిఐ తిరస్కరించడం “విచిత్రం” అని బాత్రా పిటిఐ కి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News