న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)తమ ఖాతాదారుల సేవలో మరో ముందుడుగు వేసింది. సాంకేతికతపరంగా సేవలను విస్తృతం చేసింది. ఈక్రమంలో వాట్సాప్ ద్వారా తమ ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా బ్యాంకు వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను ఎంచుకోవాలా లేదా అనేది ఖాతాదారుల ఇష్టంగా ఎస్‌బిఐ పేర్కొంది. వాటాప్ ద్వారా కస్టమర్లు తమ ఖాతాలోని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్ పొందవచ్చు. అయితే ముందుగా ఖాతాదారులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌బిఐ ఎస్‌బిఐ వాట్సాప్ నంబర్ 90226 90226 తమ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఎస్‌బిఐ అకౌంట్‌తో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్‌ను ఉపయోగించాలి.
ముందుగా నెంబర్ 7208933148సేవ్ చేసుకుని డబ్లూఎఆర్‌ఇజి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం కస్టమర్లకు వాటాప్‌లో 90226 90226 నుంచి మెసెజ్ వస్తుంది. బ్యాంకు సేవలు పొందాలనుకున్నప్పుడు వాటాప్‌లో హాయ్ మెసెజ్ పంపాల్సి ఉంటుంది. అనంతరం బ్యాంకునుంచి 1.ఖాతా బ్యాలెన్స్, 2.మినీ స్టేట్‌మెంట్ వస్తుంది. అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు 1, మినీ స్టేట్‌మెంట్‌కు 2 నంబర్‌ను టైప్ చేసి మెసెజ్ చేస్తే వివరాలు లభిస్తాయి. కాగా హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు కూడా వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించాయి.