Wednesday, January 22, 2025

బాలకృష్ణ చేయి పట్టుకున్న శ్రీలీల

- Advertisement -
- Advertisement -

‘ఎన్‌బికె 108’ చిత్రీకరణలో..

నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ ‘ఎన్‌బికె 108’. షైన్ స్క్రీ న్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర ను పోషిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల వచ్చి చేరింది. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టుకున్నట్లుగా వున్న బ్యూటీఫుల్ స్టిల్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ షెడ్యూ ల్లో ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News