Monday, December 23, 2024

జింఖానా గ్రౌండ్ పరిశీలించిన సుప్రీంకోర్టు నియమిత సంఘం

- Advertisement -
- Advertisement -

Anjani Kumara IPS

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం యాజమాన్యాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన సంఘం గురువారం జింఖానా గ్రౌండ్‌ను పరిశీలించింది. అంజనీ కుమార్(ఐపిఎస్) ఇతర కమిటీ సభ్యులు వెంకటపతి రాజు, వంక ప్రతాప్ తో కలిసి మైదానాన్ని పరిశీలించారు. రిటైర్డ్ న్యాయమూర్తి ఎన్.ఏ. కక్రు సహా నలుగురు సభ్యులతో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అన్ని స్థాయిల్లో బాలబాలికలకు క్రికెట్ శిక్షణ వసతులను కమిటీ పునరుద్ధరించనున్నది. ట్రెనింగ్ క్యాలెండర్‌ను వంక ప్రతాప్ రూపొందించుతున్నారు. ఈ అకాడమీ గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు కూడా తర్ఫీదునివ్వనున్నది. కాగా మంత్రి కెటి. రామారావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కమిటీకి మార్గదర్శకత్వం వహించనున్నారు. దీపావళి తర్వాత సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో జిల్లావారీగా కోచింగ్ మొదలుకానుంది. క్రీడాకారులకు ఉత్తమ కోచింగ్ అందనుంది. కాగా వారికి బస ఏర్పాటు ఉప్పల్ స్టేడియంలో ఉందనుంది. ప్రతి జిల్లాకు ఓ క్రికెట్ సంఘం ఉండేలా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మార్గనిర్దేశనలో క్రీడా కార్యదర్శి సందీప్ సుల్తానియా తోడ్పడనున్నారు. కాగా ఈ క్రికెట్ సంఘాలు సైతం హైదరాబాద్ క్రికెట్ సంఘంలో భాగమే కాగలవు. సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ పర్యవేక్షణ కమిటీ తదుపరి అక్టోబర్ 15న ఉప్పల్ స్టేడియంలో సమావేశం కాబోతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News