Saturday, December 21, 2024

బేషరతుగా క్షమాపణ చెప్పండి: రాఘవ్ ఛద్దాకు సుప్రీం ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెలెక్ట్ కమిటీ వివాదంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సస్పెన్షన్‌కు గురైన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దాను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.

ఈ వ్యవహారంపై రాజ్యసభ చైర్మన్ సానుభూతితో ఆలోచిస్తారని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. దీపావళి తర్వాత ఈ విషయంలో తాజా పరిణామాలను తమకు తెలియచేయాలని అటార్నీ జనరల్ వెంకటరమణిని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

వివాదాస్పద ఢిల్లీ సర్వీసుల బిల్లును అధ్యయనం చేసేందుకు ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరేందుకు రూపొందించిన తీర్మానంపై తమ అనుమతి లేకుండానే తమ పేర్లను రాఘవ్ ఛద్దా చేర్చారని అధికార బిజెపికి చెందిన ఎంపీలతోసహా పలువురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11వ తేదీన ఛద్దాను రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేసి ఈ అంశాన్ని సభా హకు్ంకలక కమిటీకి నివేదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News