- Advertisement -
ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీకి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. హోం, న్యాయ, గిరిజ, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. వర్గీకరణపై ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలోనే సుప్రీంకోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే. కమిటీ ఈ నెల 22న తొలిసారిగా భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.
- Advertisement -