Monday, December 23, 2024

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘సుప్రీం కోర్టు కొలీజియం, సెర్చ్ కమిటీ కాదు, న్యాయమూర్తుల నియామకంలో జాప్యాన్ని వివరించండి’ అంటూ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకాన్ని కేంద్రం నోటిఫై చేసేందుకు నిర్ణీత కాలపరిమితిని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది.

న్యాయమూర్తులుగా నియామకం కోసం కొలీజియం పునరుద్ఘాటించిన పేర్ల స్థితిగతులపై నివేదిక సమర్పించాలని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది.  కాగా వారి నియామకాలను ఇంకా కేంద్రం ఆమోదించాల్సి ఉంది.

ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌కు అధ్యక్షత వహించిన  భారత ప్రధాన న్యాయమూర్తి డి వై. చంద్రచూడ్… వెంకటరమణితో “మీరు ఒక చార్ట్‌ తో రండి, కొలీజియం పునరుద్ఘాటించిన ప్రతి సిఫార్సు స్థితి ఏమిటి , ఆ నియామకాలలో  ఇబ్బంది ఏమిటి? అన్నది తెలపండి” అన్నారు,

భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ “కొలీజియం శోధన కమిటీ కాదు. రాజ్యాంగ పరంగా దీనికి నిర్దిష్ట హోదా ఉంది. శోధన కమిటీ విషయంలో, సెర్చ్ కమిటీ సిఫార్సు చేస్తుంది…సిఫార్సును ఆమోదించాలా వద్దా అనే పూర్తి విచక్షణ కొలీజియంకు ఉంటుంది…కాబట్టి మీరు మా వద్దకు తిరిగి వచ్చి, పెండింగ్‌లో ఉన్న వాటి స్థితి ఏమిటో మాకు తెలపండి” అన్నారు.

కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకంపై “నిర్దిష్ట కాలపరిమితి” కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను కోర్టు ధర్మాసనం విచారించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News