Monday, December 23, 2024

ఢిల్లీ హైకోర్టు జడ్జిగా క్రిపాల్‌ను నియమించండి: సుప్రీం కొలీజియం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సీనియర్ అడ్వకేట్ సౌరభ్ క్రిపాల్‌ను ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమించాలని 2021 నవంబర్ 11న తాను చేసిన సిఫార్సును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం పునరుద్ఘాటించింది. హైకోర్టు జడ్జిగా క్రీపాల్ నియామకానికి సంబంధించిన సిఫార్సు అయిదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉందని, దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, కెఎం జోసెఫ్‌లు కూడా సభ్యులుగా ఉన్న కొలీజియం అభిప్రాయపడింది.

‘ఈ నేపథ్యంలో సౌరభ్ క్రిపాల్‌ను ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమించాలని 2021 నవంబర్ 11న చేసిన సిఫార్సును పునరుద్ఘాటించాలని కొలీజియం తీర్మానించింది’ అని సుస్రీంకోర్టు వెబ్‌సౌట్‌లో అప్‌లోడ్ చేసిన ఒక ప్రకటన పేర్కొంది. క్రిపాల్‌ను ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమించాలని 2017 అక్టోబర్ 13న ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్జు చేయగా2021 నవంబర్ 11నప్ప్రీంకోర్టు కొలీజియం దానికి ఆమోదం తెలిపింది.

అయితే ఫైల్‌లో చేసిన వ్యాఖ్యల దృష్టా ఈ సిఫార్సుపై పునరాలోచించాలని కోరుతూ కేంద్రం 2022 నవంబర్ 25న సుప్రీంకోర్టు కొలీజియంకు తిప్పి పంపింది. క్రిపాల్‌కు జడ్జిగా ఉండడానికి అవసరమైన సమర్థత, నిజాయితీ, తెలివి తేటలు ఉన్నాయని, ఆయన నియామకంతో ఢిల్లీ హైకోర్టు బెంచ్‌కి మరింత విలువ చేకూరడంతో పాటుగా తగిన కూర్పు, వైవిధ్యం చేకూరుతాయని కొలీజియం ఆ ప్రకటనలో పేర్కొంది. క్రిపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బిఎన్ క్రిపాల్ కుమారుడు కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News