Monday, December 23, 2024

23 మంది జడ్జిల బదిలీకి కొలీజీయం సిఫార్సు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హైకోర్టులకు చెందిన 23 మంది న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మరింత సమర్థవంతమైన న్యాయ పరిపాలనా వ్యవహారాల వెసులుబాట్లకు అన్ని విషయాలను పరిశీలించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారధ్యపు కొలీజియం ఈ నెల 3వ తేదీన సమావేశం అయింది. ఇప్పుడు బదిలీలకు సిఫార్సు చేసిన జాబితాలో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి హేమంత్ ఎం ప్రచ్ఛక్ కూడా ఉన్నారు. ఇటీవల తన దోషిత్వ శిక్షపై స్టే విధించాలనే రాహుల్ గాంధీ పిటిషన్‌ను ఈ జడ్జి తోసిపుచ్చారు. పలువురు జడ్జిల బదిలీల సిఫార్సుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News