Sunday, January 19, 2025

దేశంలోని అన్ని కోర్టుల విచారణల లైవ్ స్ట్రీమింగ్ ఆరంభించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సాధారణ ప్రజానీకానికి సైతం విచారణ అందుబాటులోకి తెచ్చేందుకు న్యాయవిచారణ లైవ్ స్ట్రీమింగ్ ను తన అధికారిక వెబ్ సైట్ లో సుప్రీంకోర్టు ప్రారంభించింది.  ఆ వెబ్సైట్ లింక్: https://appstreaming.sci.gov.in

ఇప్పటి వరకు లైవ్ స్ట్రీమింగ్ అనేది రాజ్యాంగ ధర్మాసనం, ఇతర జాతీయ ప్రాముఖ్యత ఉన్న విచారణలను యూట్యూబ్ లో వచ్చేది. ముఖ్యమైన విచారణలకు కృత్రిమ మేధ(ఏఐ) ని ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు, నీట్-యుజి, ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విచారణలను తనకు తానుగా(సుమోటొ) విచారించింది. ఇది చాలా ప్రజాదరణ పొందింది.

ముఖ్యమైన కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ లో పెట్టాలని సుప్రీంకోర్టు తన స్వప్నిల్ త్రిపాఠి(2018) కేసు తీర్పులో పేర్కొంది. ఆ తర్వాత దేశంలోని నలుమూలల ముఖ్యమైన కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్  ద్వారా అందించాలని నిర్ణయించింది.

దేశంలోని కింది కోర్టుల విచారణలను చూడ్డానికి, వీడియో కాన్ఫరెన్సింగ్ కు సుప్రీంకోర్టు తనదైన క్లౌడ్ సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈకోర్టుల మూడో దశలో వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం తమ స్వంత క్లౌడ్ సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ తెలిపారు. కరోనా కాలంలో దేశవ్యాప్తంగా కోర్టులు దాదాపు 43 మిలియన్ విచారణలను వర్చువల్ మోడ్ లోనే నిర్వహించినట్లు కూడా తెలిపారు. వలసవాదం కాలం నాటి విధానాలను కూడా కోర్టుల్లో తొలగించబోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News