Wednesday, January 22, 2025

కావేరి జలాల పంపకం వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం : సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కావేరీ జలాల పంపకంపై తమిళనాడు, కర్ణాటక మధ్య కొన్నిదశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడానికి సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహ్‌తగ్ ఈ సమస్యపై అత్యవసరంగా విచారించాలని చీఫ్ జస్టిస్ డివైచంద్రచూడ్, జస్టిస్‌లు జెబి పార్ధివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆగస్టు నెలకు సంబంధించి కావేరీ జలాలను విడుదల చేయాలని కోరుతూ కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి తమిళనాడు ప్రభుత్వం దరఖాస్తు సమర్పించిందని చెప్పారు.

దీనిపై చీఫ్ జస్టిస్ డివై చంద్ర చూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కావేరీ జలాల నుంచి తమకు రావలసిన వాటా పొందడానికి సుప్రీం కోర్టును ఆశ్రయించడం తప్ప మరోదారి లేదని ఈనెల 11న తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 10 న కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశంలో తమిళనాడుకు రోజుకు 15,000 క్యూసెక్కుల వంతున 15 రోజుల పాటు కావేరీ జలాలు అందించడానికి ఏకగ్రీవంగా నిర్ణయమైనా కర్ణాటక తరువాత తన వైఖరి మార్చుకుని కేవలం 8000 క్యూసెక్కులు మాత్రమే పంపిణీ చేస్తామని చెబుతోందని తమిళనాడు వాట్ రీసోర్సెస్ మంత్రి దురై మురుగన్ పేర్కొన్నారు. అందువల్ల సుప్రీం కోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News