Wednesday, January 22, 2025

డిఇఆర్‌సి చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేసిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

అంతేకాకుండా ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ ఉమేశ్‌కుమార్ ప్రమాణ స్వీకారాన్ని సైతం జులై 11 వరకు సుప్రీంకోర్టు నిలిపివేసింది. సిజెఐ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. జులై 11కు ముందు సమాధానాలను దాఖలు చేయాలని కేంద్రం, ఎల్‌జీని కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News