- Advertisement -
న్యూఢిల్లీ: బలవంతంగా ఓ వ్యక్తిని మతమార్పిడికి ప్రోత్సహించారన్న ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిందితుడిపై నమోదైన క్రిమినల్ కేసులో ఆధారాలు లేవని న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్.రవీంద్రభట్, సిటి రవికుమార్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మేందర్ దోహార్ అనే వ్యక్తిని జార్జిమంగళపల్లి బలవంతంగా క్రిస్టియన్ మతంలోకి మార్చారంటూ క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి వెసలుబాటు కల్పించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. దాంతో, జార్జి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మేందర్ ఇచ్చిన వాంగ్మూలంలో తనను ఎవరూ బలవంతం చేయలేదని చెప్పారని ధర్మాసనం తెలిపింది. దాంతో, జార్జిపై కేసును కొట్టి వేస్తున్నామని ధర్మాసనం తెలిపింది.
- Advertisement -