Thursday, January 23, 2025

ట్విన్ టవర్స్ కూల్చివేత ఆదేశాలపై పిల్ వేస్తారా ?

- Advertisement -
- Advertisement -

SC Dismisses Petition Against Demolition Of Twin Towers

సుప్రీం ధర్మాసనం ఆగ్రహం

న్యూఢిల్లీ : నొయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్ నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం తోసిపుచ్చింది. పిటిషనర్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కొవిడ్‌తో మరణించిన లాయర్ల కుటుంబాల సంక్షేమానికి ఇవ్వాలని ఆదేశించింది. సెంటర్ ఫర్ లా అండ్ గుడ్ గవర్నన్సె అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. నొయిడా ట్విన్ టవర్ల కూల్చివేతపై తామిచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ వేయడం దురుద్దేశపూరితం అని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సుధాంశు ధుల్లియాతోకూడిన ధర్మాసనం మందలించింది. పిటిషన్ ఉద్దేశం ఈ అంశంలోతామిచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా ఉందని కోర్టు నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యూపి పరిధి లో నొయిడా లోని సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ 2009 లో భారీ ప్రాజెక్టు చేపట్టింది.

భవన నిర్మాణ విషయంలో నిబంధనలను బిల్డర్ ఉల్లంఘించారు. భవన నిర్మాణానికి సంబంధించి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనలను అధికారులతో సంస్థ కుమ్మక్కై తుంగలో తొక్కింది. దీనిపై నలుగురు స్థానికులు లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం గత ఏడాది ఆగస్టు 31 న 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చి వేయాలని ఆదేశాలిచ్చింది. ఇందులో 915 ప్లాట్లు ,21 దుకాణాలు ఉన్నాయి. ట్విన్ టవర్ కూల్చివేతతోపాటు 12 శాతం వడ్డీతో ట్విన్ టవర్స్ ప్లాట్ యజమానులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కూడా సూపర్‌టెక్‌ను ఆదేశించింది. కూల్చివేత ఖర్చును కూడా సూపర్‌టెక్ భరించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవరించాలని సూపర్‌టెక్ ఆ తరువాత పిటిషన్ వేయగా, దాన్ని కోర్టు తోసిపుచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News