Friday, November 22, 2024

యూపీ మాజీ సిఎం కళ్యాణ్ సింగ్‌పై బాబ్రీ మసీదు కూల్చివేత కేసు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

SC drops contempt case against former UP CM Kalyan Singh

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, దివంగత కళ్యాణ్‌సింగ్‌పై బాబ్రీ మసీదు కూల్చివేత ధిక్కార కేసును సుప్రీం కోర్టు ఎత్తివేసింది. ఉత్తరప్రదేశ్ అయోధ్య లోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మాజీ సిఎం కళ్యాణ్ సింగ్ తదితరులపై దాఖలైన ధిక్కార కేసును సుప్రీం కోర్టు ముగించింది. పిటిషనర్ కళ్యాణ్ సింగ్ మరణాన్ని ఉటంకిస్తూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దివంగత నేత కోర్టు దిక్కారానికి సంబంధించిన కేసును సుప్రీం ఎత్తివేసింది. 2019 అయోధ్య తీర్పు నేపథ్యంలో ఈ కేసు అంశం మనుగడలో లేదని సుప్రీం పేర్కొంది. యూబీ ప్రభుత్వం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ , రథయాత్ర, బాబ్రీ కూల్చివేతలను సర్కారు అనుమతించినందున కళ్యాణ్ సింగ్ , ఇతరులపై ధిక్కార కేసు పెట్టారు. అయితే మాజీ సిఎం కళ్యాణ్ సింగ్ మరణించినందున ఈ కేసును మూసివేసింది. అయోధ్య తీర్పు వల్ల, బాబ్రీ మసీదు కూల్చివేత వల్ల ఉత్పన్నమయ్యే ఇతర కేసులు ప్రభావితం కావు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News