- Advertisement -
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్ కేసులో ఉద్యమకారుడు పి.వరవరరావుకు లొంగిపోకుండా మధ్యంతర రక్షణ కాలాన్ని జూలై 19 వరకు సుప్రీంకోర్టు మంగళవారం పొడిగించింది. జస్టిస్ యు. యు. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం బాంబే హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాయిదా వేయాలని కోరడంతో కోర్టు తన ఆదేశాలను జారీ చేసింది. ఈ విషయాన్ని బుధవారం లేదా గురువారానికి వాయిదావేయాలని మెహతా కోరారు. అప్పటి వరకు రక్షణ కొనసాగించాలని తెలిపారు. కాగా మెహతా అభ్యర్థనను అడ్డుకోబోనని సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు.
- Advertisement -