హైదరాబాద్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశ గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. ఈ మేరకు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ కోర్సుల్లో (ఆర్ట్, సైన్స్, ఒకేషనల్ కోర్సులు) ప్రవేశానికి చివరి తేది ఈ నెల 21తో ముగియనుండగా దానికి 25వ తేదీకి పొడిగించారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 25 లోగా తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. గడవులోగా విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయకపోతే ఆ సీటును రద్దు చేయడం జరుగుతుందన్నారు. అడ్మీషన్ పూర్తి చేయడానికి అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు టిసి, కులం, ఆదాయం, మార్కులు మెమో, బోనఫైడ్ లను సమర్పించాలన్నారు. అభ్యర్థులు కార్యాలయ వేళల్లో అడ్మీషన్ సంబంధిత సందేహాల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 180042545678 సేవలను ఉపయోగించుకోవాలన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ సందర్శించి వివరాలను తనఖీ చేసుకోవచ్చని తెలపారు. www.tswreis.ac.in, www.tswrjc.cgg.gov.in వెబ్‌సైట్ నుండి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
ఎస్‌సి గురుకుల కాలేజీలో ప్రవేశ గడువు పొడిగింపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -