Sunday, February 23, 2025

ఎస్‌సి గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

SC Gurukula Inter Entrance Exam Results Released

మన తెలంగాణ / హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ గురుకులాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు (ఆర్‌జెసి సెట్ 2022) నిర్వహించిన ఎంట్రెన్స్ ఫలితాలను ఎస్‌సి అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 19,360 సీట్లకు గాను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు 60,173 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను మంత్రి శనివారం రాత్రి కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల సొసైటి కార్యదర్శి రోనాల్డ్ రాస్ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. కుల, ఆదాయ, బదిలీ స్టడీ సర్టిఫికెట్స్‌తో విద్యార్థులు సకాలంలో హాజరు కావలసి ఉంటుందని సొసైటి జాయింట్ సెక్రటరి శుక్రు నాయక్ తెలిపారు. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం www.tswreis.ac.in, www.tswrjc.cgg.gov.in వెబ్‌సైట్స్‌ను పరిశీలించాల్సిందిగా ఆయన సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News