Sunday, December 22, 2024

కేటాయించిన నియోజకవర్గంలోనే ఎస్‌సి గురుకులాలు

- Advertisement -
- Advertisement -

SC Gurukuls within allotted constituency: minister Koppula

వానలు, వరదల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
బూస్టర్ డోసు టీకాలకు చర్యలు తీసుకోండి
అధికారులతో మంత్రి కొప్పుల జూమ్ మీటింగ్

హైదరాబాద్ : ఆ యా అసెంబ్లీ నియోజకవరాగలకు మంజూరై వేరే దగ్గర కొనసాగుతున్న గురుకులాలను కేటాయించిన చోటుకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్‌సి గురుకుల విద్యా సంస్థల సొసైటి కార్యదర్శి రోనాల్డ్ రాస్‌లు అధికారులను ఆదేశించారు. సొసైటీకి చెందిన 43 గురుకులాలు కేటాయించిన చోట కాకుండా వేరే ప్రాంతంలో కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు వీటిని ఆ యా నియోజకవర్గాలకు వెంటనే తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎస్‌సి గురుకులాలకు చెందిన పలు అంశాలపై బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటి కార్యదర్శి రోనాల్డ్ రాస్‌లు అధికారులు, ఆర్‌సివోలు, ప్రిన్సిపాల్స్‌తో జూమ్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన ఈ సమావేశంలో ప్రిన్సిపాల్స్‌కు మంత్రి, కార్యదర్శి పలు సూచనలు చేశారు.

దిశానిర్దేశం చేశారు. ప్రతి విషయంలో ప్రధాన కార్యాలయంపై ఆధారపడకుండా స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ సహకారం తీసుకుంటే బాగుంటుందని సలహానిచ్చారు. ఔట్‌సోర్సింగ్ పద్దతిలో అవసరమైన ఎఎన్‌ఎంలు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాల గురించి జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలన్నారు. వానలు, వరదల కారణంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. పాఠశాల ఆవరణలోని వెల్‌నెస్ సెంటర్ సిబ్బంది ప్రతి నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవసరమైన మందులు నిల్వపెట్టుకోవాలని సూచించారు. స్థానిక ఆసుపత్రి సహకారంతో విద్యార్థులందరికీ బూస్టర్ డోస్ టీకాలు ఇప్పించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలాలో పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News