హైదరాబాద్: జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ పై కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన కేసును పునపరిశీపన చేసి ఆరు నేలలలో వేగవంతంగా పూర్తి చేయాలని హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశించింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా బిబి పాటిల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయనపై ఉన్న నేరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ మదన్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, మదన్ మోహన్ అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి తోసిపిచ్చి కేసును కొట్టేశారు. దీంతో మదన్ మోహన్, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ కేసును పరిశీలించి హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి ఇచ్చిన తీర్పును కొట్టివేసి కేసును పునపరిశీలన చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఆరు నెలల్లోపు వేగవంతంగా కేసును పరిశీలించి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.
SC hear petition against Zaheerabad MP bb Patil