Monday, November 18, 2024

జాతీయ స్థాయి పోటీలకు ఎస్సీ హాస్టల్ బాలికలు

- Advertisement -
- Advertisement -

మక్తల్ : పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌కు చెందిన 11 మంది బాలికలు జాతీయ స్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీలకు ఎంపికైనట్లు హాస్టల్ వార్డెన్ అనిత, క్రీడల నిర్వహణ కార్యదర్శి గోపాలం తెలిపారు. జూన్ 25న హైదరాబాద్‌లోని గౌలిపుర క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నారాయణపేట జిల్లా తరపున పాల్గొన్న 11 మంది బాలికలు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. అండర్ 15 విభాగంలో అనుష, శ్రావణి, శివమ్మ, కవిత, మౌనిక, స్రవంతి, అండర్ 17 విభాగంలో స్వప్న, లలిత, కవిత, పాయల్ , అండర్ 13 విభాగంలో నవిత ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో నిర్వహించే జాతీయ స్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం హాస్టల్ వద్ద బాలికలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పిఈటీలు అమ్రేష్, రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News