Thursday, January 23, 2025

బిల్కిస్ బానో కేసులో వినతి విచారణకు న్యాయమూర్తి విముఖం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లప్పుడు సామూహిక అత్యాచారం కేసులో నిందితులైన 11 మందిని ముందస్తుగానే విడుదల చేయడాన్ని సవాలుచేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో పెట్టుకున్న వినతిని విచారించేందుకు సుప్రీంకోర్టు జడ్జి బేలా ఎం. త్రివేది మంగళవారం నిరాకరించారు. నాడు బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను కూడా ఆ నిందితులు చంపేశారన్న ఆరోపణ ఉంది.
న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు ఆ కేసు విచారణకు వచ్చింది. కాగా ఆ కేసును విచారించేందుకు న్యాయమూర్తి బేలా త్రివేది నిరాకరించారు. తన వినతిలో నిందితులను ముందస్తుగా విడుదల చేయడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.

అడ్వొకేట్ శోభా గుప్తా ద్వారా దాఖలు చేసిన ఆ పిటిషన్‌లో “నిందితులందరిని ముందస్తుగా విడుదలచేయడం పిటిషనర్‌కు మాత్రమే కాక అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులకు, యావత్ సమాజానికి, జాతీయంగా, అంతర్జాతీయంగా. నేరస్తులు 11 మందిని విడుదలచేయడంలో ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షకు వ్యతిరేకంగా అనేక వర్గాలు ఆగ్రహాన్ని, నిరాశ, అపనమ్మకంను వ్యక్తం చేశాయి.”

“వారు ముందస్తుగా విడుదల కావడం వల్ల తాను చాలా కలత చెందానని, తాను ఐదు నెలల గర్భంతో ఉన్నా కూడా ఆ బలాత్కారులు వదిలి పెట్టకుండా తనను సర్వనాశనం చేశారు” అని ఆమె తెలిపింది. బానో ప్రత్యేకంగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానం మే 13 ఇచ్చిన తీర్పును సవాలు చేసింది. ఈ కేసులో 1992 గుజరాత్ ఉపశమనం పాలసీకి బదులుగా, మహారాష్ట్ర ఉపశమనం పాలసీని అన్వయించాలని కోరారు. ఎందుకంటే విచారణ మహారాష్ట్రలో జరిగిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News